AP&TGPOLITICS

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్‌-వైయస్‌ జగన్‌

చంద్రబాబు తోలు మందం కాబట్టి..

అమరావతి: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియ చేశామని వైసీపీ అధినేత వైయస్‌ జగన్ చెప్పారు. గురువారం మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు జరుగుతున్న ఆన్యాయంపై గవర్నర్ కు వివరించిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తవ్రమైన ఆరోపణలు చేశారు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్‌ల మయం:- కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరిçస్తూ, స్కామ్‌ల విషయంలో చంద్రబాబు నాలుగు అడుగులు ఎక్కువ వేస్తున్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్‌ అయితే, ఆ తర్వాత రెండేళ్ల పాటు, ఆ కాలేజీల సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం మరో స్కామ్‌ అన్నారు.అంటే అక్కడున్న భూమి, భవనాలు, పని చేసే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, నిర్వహణ మాత్రం ప్రైవేటువారిది. అంటే ఖర్చు ప్రభుత్వానిది. సంపద ప్రైవేటువారికి. ఒక మెడికల్‌ కాలేజీలో జీతాలు ఏడాదికి కనీసం రూ.60 కోట్లు. రెండేళ్లకు రూ.120 కోట్లు. అంటే ఆ లెక్కన 10 మెడికల్‌ కాలేజీల సిబ్బందికి రెండేళ్లపాటు జీతంగా కనీసం రూ.1200 కోట్లు అవుతుంది. ఇలాంటి స్కామ్‌లు దేశంలో ఎక్కడా ఉండవు.

అందుకే మా పోరాటం ఆపబోము:- మా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్‌కి కోటి సంతకాలు చూపించాం. ఇక్కడి నుంచి రేపు కోర్టులో పిటిషన్‌ వేస్తాం. అక్కడ కూడా ఈ కోటి సంతకాలు చూపిస్తాం. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం.

చంద్రబాబు తోలు మందం కాబట్టి ఆయన మారకపోవచ్చు. కాబట్టి అందరూ కలిసి రావాలి. అందరం కలిసికట్టుగా మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుందాం. మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, రేపొద్దున వైద్యం కోసం ఒక్కొక్కరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *