AP&TGNATIONAL

22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్ పై స్పందించిన-పవన్ కళ్యాణ్

ఐ స్టాండ్ విత్ శర్మిష్ట,ఈక్వల్ జస్టిస్..

అమరావతి: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అయిన శర్మిష్ట అరెస్ట్‌ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి..అమె అరెస్ట్ పై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శర్మిష్ట అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “ఐ స్టాండ్ విత్ శర్మిష్ట”,,”ఈక్వల్ జస్టిస్” అనే హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో,, శర్మిష్ట అరెస్ట్ పై పెద్ద  ఎత్తున చర్చకు దారితీసింది..వివరాల్లో వెళ్లితే….

హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన శర్మిష్ట పనోలి (22) అనే యువతి పూనే లా యూనివర్శిటీలో న్యాయవాద విద్య చదువుతొంది.. శర్మిష్టను బెంగాల్ పోలీసులు గుర్గావ్ వెళ్లి మరీ అరెస్ట్ చేశారు..ఎందుకంటే ఆమె, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదులకు,, పాకిస్థాన్‌కు,,మత ఛాందసవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇస్టాగ్రాంలో పోస్ట్ పెట్టింది..ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు పెద్దగా స్పందించడంలేదని నిలదీసింది..ఆమెకు ఇస్టాగ్రాంలో దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లున్నారు..ఈ సంఘటనపై అమె తీవ్ర పదజాలంతో కూడిన ఆమె వ్యాఖ్యలు కొందరిని బాధిస్తున్నాయనే ఉద్దేశ్యంతో, ఆమె తన పోస్ట్ ను డిలీట్ చేసి,,తన తప్పును అంగీకరించి,,వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పింది..ఇక్కడితో ఈ కథ సమాప్తం కావల్సి వుంది..అయితే ఆమెను సీఎం మమతాబెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది… శర్మిష్ట చేసిన పోస్ట్‌పై కోల్ కత్తా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో ఆమెను కలకత్తా పోలీసులు గుర్గావ్‌లో అరెస్ట్ చేశారు..

శర్మిష్ట పనోలి అరెస్ట్ మీద తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్:- శర్మిష్ట అరెస్ట్‌ పై దేశవ్యాప్తంగానే కాదు,, ప్రపంచవ్యాప్తంగానూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి..సీఎం మమతా బెనర్జీ చర్యలపై తీవ్ర నిరసనలూ వ్యక్తమవుతున్నాయి..విద్యార్థిని అరెస్ట్‌ ను డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ తీవ్రంగా ఖండించారు..మిి దారుణాలు అంటూ ఆయన ప్రధాని నరేంద్రమోదీని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.. జనసేన అదినేత,,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,, శర్మిష్ట పనోలి అరెస్ట్ మీద తీవ్రంగా స్పందించారు.. మమతా బెనర్జీ ప్రభుత్వ పనితీరును కడిగిపారేశారు..అంతేకాదు,,తాను శర్మిష్టకు అండగా ఉంటానని చెబుతూ, ‘ఐ స్టాండ్ విత్ శర్మిష్ట’, ‘ఈక్వల్ జస్టిస్’ అంటూ రెండు హ్యాష్ ట్యాగ్‌లతో తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ,, సదరు పోస్ట్ గురించి క్షమాపణలు చెప్పి…పెట్టిన పోస్ట్‌ ను శర్మిష్ట తొలగించినప్పటికీ ఆమెపై బెంగాల్ పోలీసులు వేగంగా చర్య తీసుకున్నారు…కొల్ కత్తాలో ఎన్నికైన నాయకులు,, టిఎంసి ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన లోతైన,, తీవ్రమైన బాధ గురించి ఏమిటి? మన విశ్వాసాన్ని ‘గాంధ ధర్మం’ అని పిలిచినప్పుడు ఆ ఆగ్రహం ఎక్కడ ఉంది? వారి క్షమాపణ ఎక్కడ? వారి త్వరిత అరెస్టు ఎక్కడ? అని పవన్ ప్రశ్నల వర్షం కురింపించారు..ఏ మతానికి సంబంధిచిన దైవదూషణను ఎల్లప్పుడూ ఖండించాలి అయితే లౌకికవాదం అనేది కొందరికి కవచం కాదు,,మరికొందరికి కత్తి కాదు.. ఇది రెండు వైపులా ఉండే చౌరస్తా అయి ఉండాలి.. పశ్చిమ బెంగాల్ పోలీసులూ..మిమల్ని దేశం చూస్తోంది.. అందరికీ సమన్యాయంగా వ్యవహరించండి. అంటూ పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *