తెలుగు రాష్ట్రాలకు బీజెపీ నూతన అధ్యక్షలు
అమరావతి: ఇరు తెలుగు రాష్ట్రాలకు బీజెపీ నూతన అధ్యక్షలు మంగళవారం బాధ్యతలు చేపట్టారు..ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా PVN మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..మంగళవారం విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన, బాధ్యతలు అప్పగించే కార్యక్రమం జరిగింది..నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికల నిర్వాహకుడిగా వ్యవహరించిన కర్ణాటక ఎంపీ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు పీసీ మోహన్ ప్రకటించారు..అనంతరం ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు..ఆనంతరం మాధవ్‌కు అధ్యక్ష బాధ్యతలను బదలాయిస్తూ పార్టీ జెండాను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అందజేశారు..
తెలంగాణ:- తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..ఈ మేరకు ఎన్నికకు సంబంధించిన ధ్రువపత్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ఇంఛార్జి, కేంద్రమంత్రి శోభా కరండ్లాజే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు మంగళవారం రామచంద్రరావుకు అందజేశారు..అనంతరం శోభా కరంద్లజే మాట్లాడుతూ,, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని చెప్పేందుకు గర్వపడుతున్నామని అన్నారు..వచ్చే మూడేళ్లు అధ్యక్షుడిగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు..బీఆర్ఎస్‌పై ప్రజలు నిరాశతో ఉన్నారు.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై నిరాశతో ఉన్నారని తెలిపారు.. ప్రతి గ్రామం, మండలం, జిల్లాల్లో పర్యటించి,, వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం పనిచేయాలని శోభా కరంద్లజే సూచించారు.. నరేంద్ర మోడీ లాంటి సమర్ధవంతమైన వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉన్నారని,,దేశానికి మంచి జరగాలని, దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని 18 గంటలు పనిచేసే వ్యక్తి మన ప్రధానిగా ఉన్నందుకు గర్వంగా ఉందని అన్నారు..ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.