AP&TGDEVOTIONALOTHERS

పంచభూతాలను ఆధీనంలో ఉంచుకొన్న ఆదిజగపతి నీలకంఠీశ్వరుడు

శ్రీకాళహస్తీ: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక పంచభూత లింగం శ్రీకాళహస్తిలోని వాయులింగం ఒక్కటే. పంచభూత లింగాల్లో నాలుగు తమిళనాడులో ఉంటే ఒకే ఒక్క వాయువులింగ క్షేత్రంగా శ్రీకాళహస్తి ప్రశాస్తమైంది. పంచభూతాలను ఆధీనంలో ఉంచుకొని ఆదిజగపతి నీలకంఠుడు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్క రూపంలో పూజలు అందుకుంటున్నాడు. కంచిలో (పృధ్వి లింగం) కామాక్షి సమేత  ఏకాంబరేశ్వర స్వామిగా, జంబుకేశ్వరంలో (జల లింగం) అఖిలాండేశ్వరి సమేత జంబుకేశ్వరునిగా, అరుణాచలంలో (అగ్ని లింగం) అపీత కుచాంబిక సమేత అరుణాచలేశ్వరుడిగా, శ్రీకాళహస్తిలో (వాయు లింగం) శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరునిగా, చిదంబరంలో (ఆకాశ లింగం) శివకామ సుందరి సమేత చిదంబరేశ్వరస్వామిగా ప్రసిద్ధి చెందాడు. వీటన్నిటిలో శివ భక్తుల పాలిట భూకైలాసంగా విరాజిల్లే శ్రీకాళహస్తి పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ సందర్శనంతో ముక్తులబిస్తే పరమ పవిత్రమైన శ్రీకాళహస్తిలో కాలు మోపడమే ముఖ్యమని శివపురాణం పేర్కొంటుంది. శ్రీ-కాళ-హస్తులో వెలసిన స్వామి స్వయంభువు. వాయులింగంలో వెలసిన స్వామిని ఆలయ ప్రధాన అర్చకుల సైతం సృర్శించించారు. ప్రతిరోజు రుద్రాభిషేక సమయంలో పచ్చ కర్పూరంతో అగ్ర భాగం నుంచి అభిషేకిస్తారు. వాయు లింగం అనేందుకు నిదర్శనం స్వామివారి మూలమూర్తి పక్కనే ఉండే రెండు దీపాలు ఎప్పుడూ కదలికతో ఉంటాయి. వాయువుకు ప్రత్యేకగా స్వామివారి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుగా భావిస్తారు. ఇక్కడ పరమేశ్వరుడు సర్పాకారంలో ఉండటంతో ఈ క్షేత్రం రాహు,కేతు సర్ప దోష నివారణ క్షేత్రంగా కూడా ప్రసిద్ధికెక్కింది. చంద్ర, సూర్యగ్రహణాలలో ప్రపంచంలోని అన్ని దేవాలయాలను మూసేస్తారు. కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం ఆ సమయంలో స్వామికి ప్రత్యేక అభిషేకాల జరుగుతాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *