ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగుతో పాటు ఆంగ్లలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
అమరావతి: రాష్ట్రంలో ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ మేరకు ఇంగ్లీషు, తెలుగులోనూ GO MS NO-3ను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని,,90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమని ప్రభుత్వం పేర్కొంది.. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీలో తెలుగు భాషా సమగ్రతకు ఇలా ఉత్తర్వులు జారీ చేయడం తోడ్పడుతుందని,,ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది..మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి రెండు రోజుల్లో తెలుగులో అప్లోడ్ లేదా మొదట తెలుగులో జారీ చేసి రెండు రోజుల్లో ఆంగ్లం లేదా రెండు భాషల్లో ఏక సమయంలో ఉత్తర్వులు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది.. ఆంగ్లంతో పాటూ తెలుగులోనూ అదే ఉత్తర్వులు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచనలు చేసింది.. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.