AP&TG

డ‌యాగ్రిడ్ విధానంలో ఐదు ఐకానిక్ భ‌వ‌నాలు నిర్మాణాలు-మంత్రి నారాయణ

అమరావతి: రాజధాని అమరావతిలో HOD టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం భావిస్తున్న టవర్-1 కు మొదటి స్టీల్ డయాగ్రిడ్ ను అమర్చే పనులను మునిపిపాల్ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ అమ‌రావ‌తిలో జీఏడీ,హెచ్ ఓడీ ల‌కు మొత్తం 5 టవర్లు డయాగ్రిడ్ టెక్నాల‌జీతో నిర్మిస్తున్నామన్నారు. జీఏడీ ట‌వ‌ర్ మొత్తం 47 అంత‌స్తుల‌తో మిగిలిన ట‌వ‌ర్లు 40 అంత‌స్తుల‌తో నిర్మిస్తున్నమని, మొత్తం 53 లక్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల బిల్ట‌ప్ ఏరియాతో 5 ట‌వ‌ర్లు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అధికార యంత్రాంగం మొత్తం ఒకేచోట ఉండేలా ట‌వ‌ర్ల నిర్మాణం ప్లాన్ చేశామని, ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఒకేచోట అన్ని కార్యాలయాలు ఉండేలా డిజైన్ చేయడం జరిగిందన్నారు. 2028 అక్టోబర్ నాటికి అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల క్వార్ట‌ర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావ‌చ్చిందని తెలిపారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్ల‌తో పాటు ప్ర‌యివేట్ సంస్థ‌ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *