తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర
అమరావతి: పశ్చిమాసియాలో యుద్ధం పరోక్ష ప్రభావం దేశంలోని వివిధ రంగాలపై పడుతుండగా ఇందుకు విరుద్దంగా గుడ్డు ధరల నానాటికి దిగజారుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో గుడ్డు ధరలు సగానికి తగ్గాయి. యుద్ధం కారణంగా భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలచిపోయాయి. ఫలితంగా ధరలు గణనీయంగా తగ్గాయి.
100 మిలియన్లకు పైగా కోడిగుడ్లు:- జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (NECC) అందించిన డేటా ప్రకారం, గత కొన్ని వారాలలో తెలుగు రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాల్లో గుడ్ల ధరలు భారీగా తగ్గాయి. గతంలో గుడ్డు ధర రూ.7.06 ఉండగా, కేవలం ఒక వారంలోనే రూ.4.20కి తగ్గింది. దాదాపు 50 శాతంకు తగ్గిపోయింది. పలు రాష్ట్రాల్లో ప్రతిరోజూ మిలియన్లకొద్ది గుడ్లు ఉత్పత్తి అవుతాయి. అత్యధికంగా కర్ణాటకలోని హోస్పేటలో గుడ్లు ఉత్పత్తి అవుతాయి.యుద్దం కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్న గుడ్ల కంటైనర్ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు, కర్ణాటకల నుంచి గల్ఫ్ దేశాలకు ప్రతి రోజు దాదాపు 100 మిలియన్లకు పైగా గుడ్లు ఎగుమతి అవుతాయి. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఆ ఎగుమతి పూర్తిగా ఆగిపోయింది. తక్కువ వినియోగం, అధిక ఉత్పత్తి ధరల తగ్గుదలకు దారితీసింది. ధరలు తగ్గినప్పటికీ, గుడ్ల ఉత్పత్తి కొనసాగుతోంది. దింతొ ఉత్పత్తిదారులు అదనపు గుడ్లను కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేస్తున్నారు. అక్కడ వాటిని మూడు నెలల వరకు నిల్వ చేయవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి:- ఆంధ్రుప్రదేశ్, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కన్పిస్తొంది. రెండు నెలల క్రితం రూ.8 ఉన్న గుడ్డు ధర ఇప్పుడు సగానికి తగ్గింది. రెండు రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ దాదాపు 35 మిలియన్ గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్ర వార్షిక గుడ్ల ఉత్పత్తి దాదాపు రూ.18,600 కోట్లు. ఇది భారతదేశంలో మూడవ స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో గుడ్ల ధర సాధారణంగా ఏడాది పొడవునా రూ.5 నుండి రూ.6 వరకు ఉంటుంది. కొన్నిసార్లు రూ.7 కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే మార్కెట్ ధర ఇప్పుడు రూ.3.50 నుంచి 3.80 వరకు తగ్గింది. ఫలితంగా గుడ్డుకు దాదాపు రూ.1.50 నష్టం వాటిల్లింది.హైదరాబాద్‌లో ప్రస్తుతం డజన్ గుడ్ల ధర రూ.50 వరకు కాగా ఆంధ్రుప్రదేశ్ లో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

