సినీ నటి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి
హైదరాబాద్: సినీ నటి సమంత రూత్ ప్రభు, తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం మరణించారు..ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు..ఈ విషయమై నటి సమంత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.. “నాన్నా మళ్లీ మనం కలిసేంత వరకూ” అంటూ హార్ట్ బ్రేక్ అయ్యిన ఎమోజీని షేర్ చేశారు..ఈ వార్త తెలుసుకున్న సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సమంత కుటుంబానికి సంతాపం తెలియచేస్తున్నారు.. కార్డియాక్ అరెస్ట్ తో జోసఫ్ ప్రభు నిన్న రాత్రి నిద్రలోనే కన్నుమూసినట్లు సమాచారం..రేపు సామ్ తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది..సమంత ఏప్రిల్ 28, 1987న కేరళలోని అలప్పుజలో జన్మించింది.. తండ్రి జోసెఫ్ ప్రభు,,తల్లి నినెట్ ప్రభు మలయాళీ..సమంతా కుటుంబంలో ఇప్పుడు ఆమె తల్లి,,ఆమె ఇద్దరు అన్నలు (జోనాథ్, డేవిడ్) ఉన్నారు.