AP&TGMOVIESOTHERS

సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ

సినిమా షూటింగ్‌లు, ఫిలిం ప్రొడక్షన్ అంశాలపై చర్చ..

అమరావతి: బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు. సినిమా షూటింగ్‌లకు ఏపీని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నామని సంజయ్ దత్‌కు ముఖ్యమంత్రి వివరించారు. తద్వారా సినిమా, వినోద రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి సంజయ్ దత్‌ను కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *