INTERNATIONALNATIONALOTHERS

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లుతున్న ప్రధాని మోదీకి హత్య బెదిరింపు

జూలై 6 నుంచి 11 వరకు మూడు దేశాల్లో..

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు కలకలం రేగింది. ఆయనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో హత్య బెదిరింపు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో మూడు రోజుల పర్యటనలో బాగంగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. జులై 9న మెల్‌బోర్న్ మీట్స్ మోదీ ఈవెంట్‌లో అనంతరం ఆస్ట్రేలియా-ఇండియా వార్షిక సమావేశంలో కూడా మోదీ పాల్గొంటారు.

మృత్యువు కోసం వస్తున్నట్టే :- “అబూ ముస్తాఫా పేరిట ఉన్న అకౌంట్ నుంచి నిందితులు ఈ పోస్టు పెట్టారు.స్టేడియం రూఫ్‌టాప్‌ను మూసేస్తే మంచిది. ఈ కార్యక్రమానికి మోదీ రావడమంటే మృత్యువు కోసం వస్తున్నట్టే” అని కామెంట్ చేశారు. ఆ ఖాతా పేరు అరబిక్ భాషలో ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఏ IP అడ్రస్ నుంచి ఈ పోస్టు వచ్చిందో గుర్తించారు. ఈ ఉదంతంలో ఎవరినైనా అరెస్టు చేశారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనను తీవ్రంగా పరగణిస్తున్నామని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్య చేయడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ సమావేశాల గురించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ భారత్ ఆస్ట్రేలియాకు గొప్ప వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామి అని ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ జూలై 6 నుంచి 11 వరకు మూడు దేశాల్లో పర్యటిస్తారు.ఈ పర్యటనలో భాగంగా మొదట ఇండోనేషియాకు,అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. చివరిగా న్యూజిలాండ్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. 

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *