NATIONAL

గోవధపై నిషేధం ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్డులో ఫిటీషన్ దాఖలు చేసిన విజయ్ ప్రభుత్వం

అమరావతి: తమిళనాడు రాష్ట్రంలో ఆవులు,దూడల వధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధ ఉత్తర్వును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గోవధపై నిషేధం విషయంలో సీ.ఎం జోసెఫ్ విజయ్ ప్రభుత్వం గోవధను నిషేధిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా బుధవారం సుప్రీంకోర్టులో తమిళనాడు సెక్రెటరీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టు తీర్పు.. తమిళనాడు యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్, 1958కి వ్యతిరేకంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. తమిళనాడులో బక్రీద్ సందర్భంగా ఒక్క గోవును కూడా వధించకుండా చూడాలని కేవియట్ పిటిషన్‌లో కోరారు. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఒక్క గోవును వధించకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ తాజాగా విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌లో హిందూ మక్కల్ కచ్చి సంస్థ యూత్ విభాగం సెక్రెటరీ కే.సూర్య, రాష్ట్ర డీజీపీని ప్రతివాదులుగా పేర్కొన్నారు. అంతకుముందు కే.సూర్య తరఫున గత మే 27న సుప్రీంకోర్టులో అడ్వకేట్ పీవీ యోగేశ్వరన్ పిటిషన్ దాఖలు చేశారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *