వాణిజ్య నౌకలపై డ్రోన్లతో ఇరాన్ దాడి-ఇరాన్ రాడార్ కేంద్రాలపై అమెరికా దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు..
అమరావతి: హర్మూజ్ జల సంధిలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై శుక్రవారం ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. దీంతో అమెరికా ప్రతీకార దాడులు చేపట్టింది..దింతో ఇరాన్-అమెరికాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ప్రశ్నార్దకం అయింది. స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాలు చేసుకున్న శాంతి ఒప్పందానికి పరస్పర దాడులతో బీటలువారాయి. ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై దాడి చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనికి బదులుగా ఐఆర్‌జీసీ బహ్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేసింది. అలాగే గల్ఫ్ ప్రాంతంలోని పలు అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్లే దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా బలగాలు పేర్కొన్నాయి. హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం భద్రతను కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఇరాన్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటలకే ఇరాన్‌పై యూఎస్ దాడులకు పాల్పడటం గమనార్హం. ఈ దాడులకు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా కారణమని ఇరాన్ ఆరోపించింది.

