ఆర్చరీ ప్రపంచ కప్ లో స్వర్ణం గెలుచుకున్న భారత్
అమరావతి: తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 పోటీలో రికర్వ్ మిక్స్ డ్ టీమ్ విభాగంలో భారత్‌కు చెందిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్‌లు స్వర్ణం గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్నినమోదు చేశారు.ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాను వరుస సెట్లలో ఓడించారు. దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యే-జిన్, కిమ్ జె-డివోక్‌పై 5-1 తేడాతో విజయం సాధించారు. నాలుగేళ్ల తర్వాత భారత్ వరల్డ్ కప్ స్టేజ్‌లో ఈ విభాగంలో బంగారు పతకం సాధించింది. చివరిసారిగా 2022 ఇదే ఈవెంట్‌లో రిధి ఫోర్-తరుణ్‌దీప్ రాయ్ జోడీ స్వర్ణం పతకంను గెలుచుకున్నారు.

