AP&TG

ఆదివారం పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలకు అవకాశం

అమరావతి: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ,కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన 23 జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *