కాకినాడలో 44.1°C, కడపలో 43.6°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు-విపత్తుల నిర్వహణ సంస్థ
అమరావతి: రాష్ట్రంలో ఎండతీవ్రతతో పాటు పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
శుక్రవారం:- కాకినాడ(జి) కరపలో 44.1°C, కడపలో 43.6°C, పశ్చిమగోదావరి(జి) పోడూరులో 42.9°C, తిరుపతి (జి) వరదయ్యపాలెంలో 42.8°C, ఎన్టీఆర్ (జి) మోగులూరులో 42.6°C, కృష్ణా(జి) పెదపారుపూడి, నంద్యాల(జి) బనగానపల్లిలో 42.3°C, ఏలూరు(జి) ధర్మాజీగూడెం, నెల్లూరు(జి) కొమ్మిపాడులో 42.1°C, విజయనగరం(జి) తుమ్మికపల్లిలో 42°C, కర్నూలు(జి) తోవిలో 41.5°C, అనంతపురం(జి) భట్టువానిపల్లి, మార్కాపురం(జి) పెద్దరావీడు, పల్నాడు(జి) అమరావతి, పోలవరం(జి) కూనవరంలో 41.4°C, పార్వతీపురంమన్యం(జి) భామినిలో 41.2°C, ప్రకాశం(జి) కొప్పెరపాడు, శ్రీసత్యసాయి(జి) తలుపులలో 41°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
శనివారం:- ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపు శ్రీకాకుళం 8, విజయనగరం 20, పార్వతీపురంమన్యం 14, అల్లూరి 1, పోలవరం 6, అనకాపల్లి 5, కాకినాడ 2, తూర్పుగోదావరి 4, ఏలూరు 3, ఎన్టీఆర్ 3 మండలాల్లో(66) తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే 79 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఆదివారం మొత్తంగా 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

