NATIONALOTHERSWORLD

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడిన నరేంద్ర మోదీ

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పశ్చిమ ఆసియాలోని భద్రతా పరిస్థితిపై ఫోన్‌లో చర్చించారు..“ఈ పండుగల కాలం ఆ ప్రాంతానికి శాంతి, స్థిరత్వం, అభివృద్ధి తీసుకురావాలని ఆశిస్తున్నాం” అని మోదీ పేర్కొన్నారు. ఈ సంభాషణ సందర్భంగా, ప్రధాని మోదీ ఆ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ఖండించారు. నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం, షిప్పింగ్ మార్గాలను తెరిచి సురక్షితంగా ఉంచడం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ”ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తున్నాయిని,అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతున్నాయి” అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సంభాషణకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాంతీయ శాంతి, ప్రపంచ వాణిజ్య రక్షణపై భారత్ తన ఆందోళనలను స్పష్టంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పెజెష్కియన్ ఇరాన్‌లోని పరిస్థితిపై ప్రధాని మోదీకి వివరించి, ఆ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఫిబ్రవరి 28న ఘర్షణ ప్రారంభమైన తర్వాత, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరియు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి కూడా ఇటీవలి వారాల్లో పలుమార్లు మాట్లాడుకున్నారు. భద్రతా పరిస్థితిని సమీక్షించడంతో పాటు, ఇద్దరు మంత్రులు నౌకా రవాణా భద్రత, ద్వైపాక్షిక సహకారం-బ్రిక్స్ సంబంధిత అంశాలపై చర్చించారు. ప్రస్తుతం ఈ కూటమికి భారతదేశం అధ్యక్షత వహిస్తుండగా, ఇరాన్ సభ్యదేశంగా ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *