విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి
అమరావతి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, NCP అధినేత అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు విమానంలో వెళ్తుండగా ఉదయం సుమారు 8.46 గంటల సమయంలో బారామతి విమానాశ్రయం రన్‌వే సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి విమానం రన్‌వే పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో కూలిపోవడంతో వెంటనే మంటలు చేలరేగాయి.ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో 5 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు డీజీసీఏ ధృవీకరించింది.
16 వేల గంటల ఎక్స్ పీరియన్స్:- కెప్టెన్ సుమిత్ కుమార్, కో పైలట్ శాంభవి ఆ విమానాన్ని నడిపారు. పైలట్ సుమిత్ కుమార్ చాలా అనుభవమైన పైలట్. దాదాపు 16 వేల గంటల ఎక్స్ పీరియన్స్ ఉంది. విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ (విజిబులిటీ) వాతావరణ పరిస్థితులు అనుకూలంగా తెలుస్తొంది.
క్లియరెన్స్ వచ్చింది:- బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నుంచి క్లియరెన్స్ వచ్చినట్టుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తొలుత ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానం ఒక రౌండ్ చక్కర్లు కొట్టిందని అధికార వర్గాల పేర్కొన్నాయి.
రన్ వే పై దిగడానికి కొద్ది మీటర్ల ముందు:- 11వ నెంబర్ రన్‌వే పై దిగేందుకు విమానాశ్రయ సిబ్బంది అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది.గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ పైలట్ ఆ రన్‌వే పై ల్యాండ్ అవుతున్న సమయంలో ల్యాండింగ్ మిస్ అప్రోచ్ అవుతుట్టుగా వీఎస్ఆర్ ఏవియేషన్ వెల్లడించింది. మిస్ అప్రోచ్ కారణంగా రెండోసారి ల్యాండింగ్ సమయంలో సరిగ్గా రన్‌వే పై దిగడానికి కొద్ది మీటర్ల ముందు దిగువ ప్రాంతంలో అది బండను ఢీ కొట్టినట్టుగా తెలుస్తోంది. ఆ క్రాష్‌కు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

