AP&TGDISTRICTS

జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ,నిర్మాణ పనులను వేగవంతo-కలెక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి: శ్రీ సిటీకి సంబంధించిన పెండింగ్ పనులు, ఎల్ జి కంపెనీ ఫేజ్ 1, 2 పనులు,  జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్, నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అదేశించారు. మంగళవారం జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు తో కలిసి జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి, నెల్లూరు, నేషనల్ హైవే పి డి లు తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ఆర్డీఓలు, రామ్మోహన్, కిరణ్మయి, భానుప్రకాష్ రెడ్డి సంబంధిత మండలాల తాసిల్దార్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… శ్రీ సిటీకి సంబంధించిన జాతీయ రహదారి అనుసంధానం అప్రోచ్ వంతెన కు సంబంధించిన ఆక్రమణ నిర్మాణాలు తొలగించాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులలో భాగంగా తిరుపతి కడప జాతీయ రహదారుల పనులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైపులైన్ పనులు త్వరితగతన పూర్తి చేయాలన్నారు. ఏపీఐఐసీ సంబంధించిన  దుగ్గరాజపట్నం పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులు  పురోగతిలో ఉన్న రేణిగుంట, పూడి, బైపాస్ లైన్ పనులు, గూడూరు, రేణిగుంట, పాకాల, తిరుపతి టౌన్ సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు, తిరుపతి కాట్పాడి, అరక్కోణం రేణిగుంట పనులకు సంబంధించిన  పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ఆరు లైన్లు రహదారులు నిర్మాణం, తిరుపతి బైపాస్ వేగవంతం చేయాలని, రేణిగుంట నుండి చెన్నైరహదారుల పనులు పూర్తి చేయాలని, భూ సేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు  నేషనల్ హైవే  అధికారులతో సమన్వయంతో చేసుకొని నాణ్యతతో పనులు పూర్తి కావాలన్నారు. తిరుపతి రేణిగుంట బైపాస్ సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలని ఆర్డీఓ లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, శ్రీసిటీ జనరల్ మేనేజర్ భగవాన్, డెప్యూటీ తాసిల్దార్ లు, సెక్షన్ సూంపర్నిటెండెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *