భారతదేశం, ఇరాన్ ల మధ్య 3 వేల సంవత్సరాల క్రిందటే పటిష్టమైన బంధం
అమరావతి: ఇస్లాం ఆవిర్భావం కంటే వందల సంవత్సరాల ముందే ఇరాన్, భారతదేశం మధ్య పటిష్టమైన బంధం ఏర్పడిందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకిమ్ ఇలాహీ వెల్లడించారు. ఇరాన్, భారతదేశం మధ్య పటిష్టమైన బంధం 3000 ఏళ్ల పురాతనమైనదని,, ఈ బంధం భవిష్యత్తులో కూడా కొనసాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ తాత్విక పుస్తకాలను ఇరాన్‌లో అధ్యయనం చేసేవారని అన్నారు. గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యంలో భారతదేశం సాధించిన విజయాలను ఇరాన్‌లో అధ్యయనం చేశారని,, రెండు పురాతన నాగరికతల మధ్య బంధాన్ని ఇరాన్ ప్రజలు గౌరవిస్తారన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు, సహకారం గురించి మాట్లాడుతుంటారు. ఇతర దేశాల ఆంక్షల వల్ల భారత్ ఎప్పుడూ ప్రభావితం కాలేదని పేర్కొన్నారు.

