61,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందచేసిన ప్రధాని మోదీ
అమరావతి: దేశవ్యాప్తంగా శనివారం జరిగిన 18వ రోజ్ గార్ మేళా కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 61,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలను వర్చువల్గా అందించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 45 కేంద్రాల నుంచి నిర్వహించారు. కొత్తగా వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన వారికి నియామక పత్రాలను ప్రధాని మోదీ అందజేసిన సందర్బంలో మాట్లాడుతూ మొత్తం నియామకాల్లో 49,200,, హోంమంత్రిత్వ శాఖ, పారామిలిటరీ దళాలకు సంబంధించినవని అన్నారు.మహిళా కానిస్టేబుల్స్ భారీగా ఎంపిక అవుతున్నారని, గత 11 సంవత్సరాల్లో ప్రభుత్వం అనేక నియమాకాల సడలింపు చర్యలు తీసుకున్నందు వల్ల ఇది సాధ్యమైందని వెల్లడించారు

