ఆఫీసులో రసలీలలు నెరిపిన డీజెపీ రామచంద్రరావు సస్పెండ్
అమరావతి: కర్నాటక పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి కే రామచంద్రరావు రసలీలలకు సంబంధించి వీడియోలు వైరల్ కావడంతో కర్నాటక ప్రభుత్వం ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ స్థాయి ర్యాంక్ అయిన పోలీసు ఆఫీసర్ మహిళలతో తన ఛాంబర్‌లోనే అడిన రాసలీలల ఘటనకు చెందిన కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో కర్నాటక రాష్ట్రంలో ఆ అంశం తీవ్ర చర్చకు దారితీసింది.రామచంద్రరావు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నట్లు వీడియోల్లో ఉన్నదని చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్నది. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్ మెంట్లో డీజీపీగా చేస్తున్న కే రామచంద్రరావును తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తన స్టేట్మెంట్లో తెలిపింది. అలాగే సస్పెన్షన్ సమయంలో ఆయన హెడ్‌క్వార్టర్స్ ను వీడి వెళ్లరాదని,, రాష్ట్ర ప్రభుత్వ లిఖితపూర్వక అనుమతితోనే ఆయన బయటకు వెళ్లాల్సి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు.

