AP&TGNATIONAL

మార్షల్ ఆర్ట్స్‌ లో అత్యంత గౌరవమైన 5వ డాన్ అందుకున్న పవన్ కళ్యాణ్

భారతదేశంలో తొలి వ్యక్తి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, జపనీస్ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్‌ లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన “సోగో బుడో కన్రికై” ప్రతిష్టాత్మకమైన 5వ డాన్‌ను ప్రదానం చేసింది. అలాగూ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుతో సత్కరించింది. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తన హ్యాండిల్ లో అధికారికంగా పోస్ట్ చేసింది.  పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ అనే పేరుతో ఒక వీడియోను షేర్ చేస్తూ,, పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఎలా మొదలుపెట్టారు?  ఎక్కడెక్కడ నేర్చుకున్నారు? ఎలా మార్షల్ ఆర్ట్స్ లో పట్టు సాధించారు అనే విషయాలన్ని సదరు వీడియోలో పొందుపరిచారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వీడియోకు వాయిస్ అందించినట్లు తెలుస్తోంది. మార్షల్ ఆర్ట్స్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎన్నో సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి గుర్తింపుగా డిసెంబర్ 30, 2025న ఆయన ఒక అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు.

భారత దేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రొఫెసర్ డా.సిద్దిఖీ మహ్మద్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును అందుకున్నారు. ఇలాంటి ఒక బిరుదును అందుకున్న భారతదేశంలోని తొలి వ్యక్తి పవన్ కళ్యాణ్. సోగో బుడో కన్రికై సంస్థ ద్వారా 5వ డాన్ గౌరవాన్ని సోకే మరమత్సు సెన్సై నేతృత్వంలో టకెడా షింగ్ క్లాన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ కి స్థానం కల్పించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *