స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడితే ఊరుకోను-మంత్రి నారాయణ
అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వాళ్ళ మాటలు విని ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ తెలిపారు..నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ ,ఇరిగేషన్,టౌన్ ప్లానింగ్,ఇంజనీరింగ్,టిడ్కో, హౌసింగ్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు.
వరద ముప్పును తప్పించే అంశంపై కీలక చర్చ జరిపామని..పంటకాలువల ఆధునీకరణ పనుల్లో ఆక్రమణల తొలగింపులో మార్పులు చేసామన్నారు. దాంతో 80 శాతం ఇళ్ళు తొలగించాల్సిన అవసరం లేదని..ఇళ్ళు కోల్పోయే 20 శాతం మందిలో పేదలు ఉంటే ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు.. రాజకీయ ప్రయోజనాలకోసం కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని,వాళ్ళమాటలు విని ఆందోళన చెందవొద్దున్నారు..ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చేస్తానన్నారు.. మున్సిపల్ హై స్కూల్స్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నామని,ఇప్పటికే వీఆర్సీ ని అత్యున్నత ప్రమాణాలతో ప్రారంభించామన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి మరో 14 స్కూల్స్ ఆధునీకరణకు ముందుకొచ్చిన దాతలకు మంత్రి నారాయణ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

