తిరుపతి-సాయి నగర్ షిరిడి ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభం
తిరుపతి: తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి-సాయి నగర్ షిర్డీ వీక్లీ ఎక్స్ ప్రెస్ (Train No.17425)ను వర్చువల్ గా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు అయిన తిరుపతి-షిరిడి మధ్య అనుసంధానం పెంచేందుకు రెండో వీక్లీ ఎక్స్ ప్రెస్ కు శ్రీకారం చుట్టారు. తిరుపతి నుంచి వయా గూడూరు – ఒంగోలు – గుంటూరు – సికింద్రాబాద్ మీదుగా షిరిడికి ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రయాణించనున్నది. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పాల్గొన్న రైల్వే శాఖ ఉన్నతాధికారులు, కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

