AP&TG

బలహీన పడుతున్న’దిత్వా’ తుపాను

అమరావతి: తీవ్రవాయుగుండంగా మారిన దిత్వా తుఫాన్ బలహీనపడి సోమవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదులుతున్న ‘దిత్వా’ తుపాను ప్రబావంతో సముద్రం అలజడిగా ఉంటుందని పేర్కొన్నారు.రాబోయే 24 గంటల్లో ప్రభావంతో,,ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు,  కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *