చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం-డ్రైవర్లుతో సహా 21 మంది దుర్మరణం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి సోమవారం ఉధయం 6.15 నిమిషాల ప్రాంతంలో హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టిన ఘోర ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది దుర్మరణం చెందారు..మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.. బస్సుపై కంకర లోడు పడడంతో పలువురు ప్రయాణికులు అందులో చిక్కుకునిపోయారు..సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్న జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు..కంకరలో కూరుకుపోయిన 15 మందిని బస్సులోనుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు..తాండూరు డిపోకు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం..వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తున్నది..ఆర్టీసీ బస్సు డ్రైవర్, టిప్పర్ లారీ డ్రైవర్లు ప్రమాదకరమైన టర్నింగ్ కూడా స్లో చేయకుండా వేగంగా డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు పేర్కొంటున్నారు..ఈ ఘోద ప్రమాదంలో ఏడాది పాపతో సహా 10 మంది మహిళలు,, 9 మంది పురుషులు మరణించారు..మృతుల సంఖ్ పెరిగే అవకాశం వున్నదని అధికారులు పేర్కొన్నారు.

