రాజధాని అమరావతిలో సీఆర్డీయే కార్యాలయంను ప్రారంభించిన సీ.ఎం చంద్రబాబు
అమరావతి: రాజధాని అమరావతిలో CRDA కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. ప్రతి ఫ్లోర్‌లోకి వెళ్లి పరిశీలించారు. అనంతరం సీఆర్డీయే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, పొన్నూరు ఎమ్మెల్యేలు ధూలిపాళ్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత అధికారికంగా ప్రారంభించిన ప్రభుత్వం భవనం.మునిసిపాల్ శాఖ మంత్రి నారాయణ నిరంతర పరివేక్షణతో తక్కవ వ్యవధిలో భవన నిర్మాణం పూర్తి చేసుకుంది.మంత్రి నారాయణకు news19tv.com తరపున అబినందనలు.

