రాష్ట్రంలో భారీ విద్యుత్ ప్రసార ప్రాజెక్టుకు కేంద్రం సహాయం రూ.27,370 కోట్లు
గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
అమరావతి: రాష్ట్రంలో రూ.27,370 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భారీ విద్యుత్ ప్రసార ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం అందించింది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించేందుకు అవసరం అయిన గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదించింది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం ఉదారంగ సాయం అందచేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 7,872 సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ లైన్లు, రామాయపట్నం, కొప్పాకలలో కొత్తగా 400 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో విద్యుత్ ప్రసార వ్యవస్థ ఆధునికీకరణకు మోదీ సర్కార్ ఆమోదం తెలిపింది.

