AP&TG

బాపట్ల-విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం-వాతావరణశాఖ

గరిష్ఠంగా 140కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు..

ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి..

అమరావతి: తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్, గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిమీ వేగంతో కదులుతొందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ప్రస్తుతానికి విశాఖపట్నంకు 540కి.మీ, కాకినాడకు 620 కి.మీ., మచిలీపట్నంకు 720 కి.మీ., బాపట్లకు 790 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిందని వెల్లడించింది.

గరిష్ఠంగా 140కిమీ వేగంతో:- సోమవారం అర్ధరాత్రికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాన్, మంగళవారం అతి తీవ్ర తుపాన్ గా బలపడనున్న అర్నబ్,,బుధవారం ఉదయం నాటికి తీరం దాటే అవకాశం వుందని,తీరం దాటే సమయంలో 115-125కిమీ, గరిష్ఠంగా 140కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి:- తుపాను దగ్గరకు వచ్చే కొద్ది దిని తీవ్రత కనిపిస్తుందని తెలిపింది.ప్రజలు వీలైనంత వరకు మంగళ,బుధవారాల్లో  ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచింది.

అత్యంత భారీ వర్షాలు:– దీని ప్రభావంతో మంగళ,బుధవారాల్లో కొన్నిప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సోమవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *