దేశ రక్షణ రంగం మరింత బలోపేతం-రూ.2,12 లక్షల కోట్ల ప్రతిపాదనలకు అమోదం
అమరావతి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC), సాయుధ దళాల కోసం సుమారు రూ. 2,12,000 కోట్ల విలువైన నిధుల సమీకరణ ప్రతిపాదనలకు ‘అవసరమైన ఆమోదం’ (ఏఓఎన్) మంజూరు చేసింది. ఈ ప్రతిపాదన ఆమోదంతో దేశీయంగ డిఫెన్స్ తయారీ రంగంకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఆమోదించిన ప్రతిపాదనల ప్రకారం దాదాపు 82% రక్షణ పరికరాలు భారతీయ పరిశ్రమల నుండే కొనుగొలు చేస్తారు.
రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనల ఆమోదించడంతో, భారత సైన్యం కోసం హై మొబిలిటీ వాహనాలు, సెల్ఫ్-ప్రొపెల్డ్ ట్రాక్డ్గన్ సిస్టమ్, తేలికపాటి మల్టీ-రోల్ హెలికాప్టర్లు, స్వల్ప శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ, కౌంటర్ అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్ (సీ-యూఏఎస్) కొనుగోలుకు ఆమోదం లభించింది. అలాగే భారత సైన్యం కోసం ఇతర మానవ రహిత వైమానిక వ్యవస్థలు, నిఘా విమానాలు, సమీకృత నిఘా, దాడి వ్యవస్థలు, లాంగ్-రేంజ్ కామికాజీ డ్రోన్ వ్యవస్థలు కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. అలాగే భారత నౌకాదళం కోసం యాక్టివ్ ఆఫ్‌బోర్డ్ డెకాయ్ సిస్టమ్ (AODS), ఇతర ప్రధాన నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌ల కొనుగోలుకు కూడా ఆమోదం లభించింది. అలాగే భారత వైమానిక దళం కోసం హెలికాప్టర్లు, వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్ల సేకరణకు డీఏసీ ఆమోదం తెలిపింది. ఈ రక్షణ పరికరాల్లో దాదాపు 82 శాతం భారత పరిశ్రమల నుంచే కొనుగోలు చేయనున్నారు.

