ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీకాలం 6 నెలలు పొడిగింపు
అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన ఆయన పదవి విరమణ చేయాల్సి ఉన్న విషయం విదితమే. ఈ మేరకు సాయిప్రసాద్ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిపై సాయిప్రసాద్ పదవీకాలాన్ని ఆరు నెలల పాటు డీఓపీటీ పొడిగించింది. దీంతో వచ్చే ఏడాది మే 30వ తేదీ వరకు చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్ కొనసాగనున్నారు.

