AP&TG

నాలుగు రోజులు చెదురుమదురు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

అమరావతి: రాష్ట్రంలో రానున్న 4 రోజులు చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్ష సూచన వివరాలు:- విజయనగరం, మన్యం, అల్లూరి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు.

శ్రీకాకుళం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *