నేపాల్ లో ప్రకోపించిన ప్రకృతి-384 మంది యాత్రికులు గల్లంతు
అమరావతి: నేపాల్‌లో బుధవారం సంభవించిన వరదలు సరిహద్దులోని టిబెట్ నుంచి మొదలై నేపాల్‌లోకి పోటెత్తాయని నేపాల్ అధికారులు వెల్లడించారు. ఈ వరదల వల్ల నేపాల్‌లోని భోటె కోషి నది ఉప్పొంగి నువాకోట్, ధాడింగ్ జిల్లాలను ముంచెత్తింది.వరదల ధాటికి 8 మంది మరణించగా 105 మంది భారతీయులు సహా ఇతరులు గల్లంతయ్యారని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభినారాయణ్ కఫ్లే వెల్లడించారు.
కనీసం 384 మంది యాత్రికులు గల్లంతు:- సరిహద్దులోని టిబెట్ నుంచి నేపాల్‌లోకి ప్రవేశించిన జల ప్రవాహంతో అనేక గ్రామాలు కొట్టుకుపోయాయని,ప్రాథమిక అంచనల్లో కనీసం 384 మంది యాత్రికులు గల్లంతయ్యారు. వీరిలో 291 మంది విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 93 మంది నేపాలీయులు గల్లంతయ్యారని నేపాల్ టూరిజం బోర్డు వెల్లడించింది. రసువా జిల్లాలో కనీసం 26 మంది పోలీసులు సిబ్బంది గల్లంతయ్యారని సమాచారం. నేపాల్ సైన్యం హెలికాప్టర్లు, విపత్తు నివారణ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టింది. అలాగే జలవిద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి.
నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంజ్ అథారిటీతో అత్యవసరం సమావేశం నిర్వహించారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు వైద్యులు, అధికారులను ఆదేశించారు.

