సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూల్ పేరుతో దుష్ప్రచారం-రాష్ట్ర ఎన్నికల అధికారి
అమరావతి: సెప్టంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నయంటూ, సోషల్ మీడియాలో ఎన్నికల షెడ్యూల్ పేరుతో దుష్ప్రచారం జరుగుతొందని రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్‌చంద్ర పునేఠా అన్నారు. వాట్సాప్‌లో తిరిగే ఎన్నికల తేదీలను నమ్మవద్దన్నారు. అధికారిక అనుమతి లేకుండా ఎన్నికల సంఘం పేరు, లోగో దుర్వినియోగం చట్టరీత్యా నేరమని అన్నారు. అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని అలాగే సదరు వార్తను షేర్ చేయొద్దని కోరారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమాచారం మీడియా ద్వారానే వెల్లడిస్తామని, అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇలాంటి వాటిని నమ్మవద్దని కోరారు. ఎన్నికల సంఘం అధికారిక సమాచారాన్నే ఆధారంగా తీసుకోవాలని ప్రజలు, మీడియాకు సూచించారు. ఈ మేరక ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ప్రకటన విడుదల చేశారు.

