AP&TGMOVIESOTHERS

నటి షావుకారు జానకి మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం

శ్రీమతి షావుకారు జానకి ఆత్మకు శాంతి చేకూరాలి–పవన్

వయోభారంతో పాటు..

హైదరాబాద్: అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి (94) ఆకస్మిక మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన షావుకారు జానకి భౌతికంగా మనకు దూరం అయినా ఆమె నటించిన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతారు. షావుకారు జానకి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు సీ.ఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఉపముఖ్యమంత్రి: ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానకి కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి శ్రీమతి జానకి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారు. శ్రీమతి షావుకారు జానకి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

వయోభారంతో పాటు శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. 

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *