హిందువుల్లో చైతన్యం రాకపోతే సనాతధర్మమే ప్రమాదంలో పడిపోతుంది-పవన్ కళ్యాణ్
అమరావతి: హిందువుల్లో చైతన్యం రాకపోతే సనాతధర్మమే ప్రమాదంలో పడిపోతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.మంగళవారం అసెంబ్లీలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై జరిగిన లఘు చర్చ,సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ, శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి ఉపయోగించలేదని ఇప్పటికే తేలిపోయిందన్నారు. నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోందని, అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. కల్తీ నెయ్యి తయారీలోనూ సృజనాత్మకత చూపించారని, నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచీ తయారు చేయొచ్చని నిరూపించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాధినేత తప్పుచేశారని తానెక్కడా చెప్పలేదని.. అప్పటి టీటీడీ పాలకమండలి తన బాధ్యత నిర్వహణలో విఫలమైందని విమర్శించారు. ఏడుకొండలవాడితో పెట్టుకున్న వారు బాగుపడిన దాఖాలు లేవన్నారు. శ్రీవారి డబ్బును ఆశించే వారి తరలు,తరాలు కాలగర్భంలో కలసి పోయాయ్యని గుర్తు చేశారు.
