రష్యాను వణికించిన భారీ భూప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై 8.7గా గుర్తింపు
రష్యా,జపాన్ తీరాలను ప్రాంతాలను తాకిన సునామీ..
అమరావతి: రష్యాను భారీ భూప్రకంపనలు బుధవారం వేకువజామున కుదిపేశాయి.. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 8.7గా గుర్తించారు.. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు..ఈ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేసిన కొంతసేపటికే .రష్యాలోని కురిల్ దీవులు,,జపాన్లోని ఉత్తర ద్వీపమైన హక్వైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది..భూప్రకంపనల నేపథ్యంలోని కంచట్కా, పెట్రోపావ్లోవ్స్క్ నగరాల్లోని పలు భవనాలు కంపించాయని రష్యా మీడియా వెల్లడించింది.. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారని,,విద్యుత్, సెల్ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని పేర్కొంది..ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదు..

