ఇరాన్ డ్రోన్ యూనిట్ కమాండర్ అమీన్ జుడ్ఖిని అంతమొందించాం-ఇజ్రాయెల్
అమరావతి: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తొమ్మిదో రోజుకు చేరడంతో,, టెహ్రాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు భీకర దాడులు చేసింది..ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) వైమానిక దళం డ్రోన్ యూనిట్ కమాండర్ అమీన్ జుడ్ఖిని అంతమొందించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది..గత వారం టెల్ అవీవ్‌పై ఇరాన్ చేసిన డ్రోన్ దాడుల వెనుక అమీన్ మాస్టర్ మైండ్ ఉన్నట్లు వెల్లడించింది..ఇరాన్‌లోని అహ్వాజ్ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ భూభాగం వైపు వందలాది డ్రోన్ దాడులకు అతడు నేతృత్వంలో జరిగినట్లు తెలిపింది..ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇరాన్‌వైపు భారీ నష్టం వాటిల్లుతున్నట్లు సమాచారం..ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్‌కు చెందిన పలువురు కీలక కమాండర్లు మృతి చెందారు.. అలాగే ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది..ఈ దాడిలో ఎలాంటి ప్రమాదకర వాయువులు లీక్ అవ్వలేదని తెలిపింది..అక్కడ అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు వెల్లడించింది..ఇజ్రాయెల్ దాడులతో ఇస్ఫహాన్ నగరం పేలుళ్లతో దద్దరిల్లిందని,,ఇదే సమయంలో ఖొండాబ్ అణు పరిశోధనా రియాక్టర్ సమీపంలోని ప్రాంతంపై కూడా ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు పేర్కొంది.

