NATIONALOTHERSWORLD

భారత్ పై 100 శాతం సుంకాలు విధిస్తాం-అమెరికా బుడ్డబెదిరింపులు

అమరావతి: నక్కజిత్తుల అమెరికా,, భారతదేశంకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది..రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతి చేసుకుంటే 100 శాతం సుంకాలు విధించనున్నట్లు యూఎస్‌ సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌ హెచ్చరించారు.. భారత్‌ మాత్రమే కాకుండా రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలు చేసే చైనా,, బ్రెజిల్‌ వంటి దేశాలకు కూడా ఇలాంటి హెచ్చరికలే చేశారు..రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్‌ కొనుగోలు చేసి,,ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం కొనసాగించేందుకు సహకరిస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తామంటూ హెచ్చరించారు..

ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం ఆపి,,ఉక్రెయిన్ లో ఉన్న విలువైన ఖనిజ సంపాదను తరలించేందుకు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది..ఇదే సమయంలో అమెరికా కుట్రలు పసికట్టిన రష్యా,,ఉక్రెయిన్ లో ఖనిజలు విపరీతంగా ఉన్న ప్రాంతాలను క్రమేపి తన అధీనంలోకి తీసుకొంటుంది..ఈ విషయం జీర్ణించుకోలేని అమెరికా తను “శాంతి దూతను అంటూ నక్కజిత్తులు ప్రదర్శిస్తూ”,,రష్యా ఆర్థికంగా వ్యవస్థను దెబ్బతీసేందుకు చర్యలు చేపట్టింది.. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని యోచిస్తోంది..యుద్దంలో ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వకుంటే 500 శాతం,,రష్యాతో వ్యాపారం చేస్తే 100 శాతం అంటూ బెదిరింపులకు దిగుతొంది..

ఏ దేశాలకైన వాణిజ్యం అనేది రెండు వైపుల నుంచి జరుగుతుంది..ఒక వేళ అమెరికా,,భారత్,చైనా,బ్రెజిల్ పై 100 శాతం సుంకాలు విధిస్తే,,ఈ మూడు దేశాలు చెతులు ముడుచుకుని కుర్చుంటాయా? అమెరికా బుడ్డబెదిరింపులకు భారతీయులు భయపడతారా?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *