ప్రతి అక్రమ వలసదారుడిని దేశం నంచి తరిమివేస్తాం- ప్రధాని మోదీ
అమరావతి: దేశంలోకి అక్రమ వలసదారుల జనాభా పెరగడం ఆందోళన కలిగించే విషయమని,,ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తాను కొత్తగా ప్రారంభించిన ‘హై-పవర్ డెమోగ్రఫీ మిషన్’ గురించి ప్రస్తావిస్తూ,,ఈ మిషన్ త్వరలో ప్రారంభమవుతుందని, ఈ ప్రభుత్వం భారతదేశం నుంచి ‘ప్రతి అక్రమ వలసదారుడిని తరిమివేస్తుందని’ ప్రధాని మోదీ అన్నారు..శుక్రవారం బీహార్ లోని గయా జీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ బీహార్ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా వేగంగా మారుతోందని,దేశంలోకి వస్తున్న ఆక్రమ చొరబాటుదారులు బీహార్ రాష్ట్ర ప్రజల హక్కులను లాక్కోవడానికి అనుమతించబోమని ప్రధాని చెప్పారు..
కాంగ్రెస్, RJD పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి అలాంటి వారి పట్ల తమ బుజ్జగింపు విధానాలు అవలంభిస్తున్నాయని మోదీ మండిపడ్డారు..ఇందులో భాగంగానే బీహార్ ప్రజల హక్కులను.. అక్రమ వలసదారులకు ఇవ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీలు కోరుకుంటున్నాయని ప్రధాని ఆరోపించారు.. మోదీ..’డబుల్ ఇంజిన్’ NDA ప్రభుత్వం ఈ ఆటలు సాగనివ్వదని పేర్కొన్నారు..భారతీయులకు చెందాల్సిన అవకాశాలను,, అక్రమ వలసదారులు లాక్కుంటుంటే చూస్తూ ఊరుకోబోమని, దేశ భవిష్యత్తును పరాయివాళ్ల చేతుల్లో వెళ్లనివ్వమని స్పష్టం చేశారు..
అర్జేడీ పాలనలో చీకటి రోజులు:- ఆర్జేడీ,,కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..లాంతరు (లాలు ప్రసాద్,,RJD పార్టీని ఉద్దేశించి) పాలనలో బిహార్లో పరిస్థితి ఎలా ఉండేదో ఓ సారి గుర్తుంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. ఈ ప్రాంతమంతా రెడ్ టెర్రర్ గుప్పిట్లో ఉండేదని గుర్తు చేశారు..అర్జేడీ పాలనలో గయా జీ వంటి నగరంతో పాటు రాష్ట్రం మొత్తాన్ని చీకట్లో వుండేదని ఆరోపించారు.. లాంతర్ పాలనలో సాయంత్రం ఎక్కడికైనా వెళ్లలి అంటే చాలా కష్టపడాల్సి వచ్చేదని ఎద్దేవా చేశారు.. విద్యుత్ స్తంభాలు కూడా లేని వేలాది గ్రామాలు ఉండేవన్నారు.. విద్య, సరైన ఉపాధి లేక బిహారీలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సి వచ్చేదని విమర్శించారు.