ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశాం-మహిళా ఆఫీసర్లు
అమరావతి: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన సంఘటన గురించి మీడియాకు వివరించేందుకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రితో పాటు ఇద్దరు మహిళా ఆఫీసర్లు పాల్గొన్నారు..వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో పాటు కల్నల్ సోఫియా ఖురేషి సదరు ఆపరేషన్ గురించి హిందీ,,ఇంగ్లీష్ లో వివరించారు.. ఆపరేషన్‌కు సిందూర్ అని పేరు పెట్టడంలో వెనుక, పెహల్గామ్ ఉగ్రదాడిలో భర్తలు కోల్పోయిన మహిళలు తమ సిందూరాన్ని కోల్పోయారు..బాధిత మహిళలను గౌరవిస్తున్న రీతిలో కేంద్ర ప్రభుత్వం సిందూర్ అనే పేరు పెట్టింది.. విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశామని,,సదరు ఉగ్రవాదులు సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడ్డారని వారు తెలిపారు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ మిలిటరీ కేంద్రాలను,,సివిలియన్స్ కు ఎలాంటి నష్టం జరగకుండా దాడులు చేయడం జరిగిందని కల్నల్ సోఫియా ఖురేషి,, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు వెల్లడించారు.. మొత్తం 9 ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు..వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ,, ప్రతిదాడి అంశంలో భారత్ సంయమనం పాటించిందని,, పాకిస్థాన్ కవ్వింపు చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తంగా ఉన్నామని తెలిపారు..
వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్:-భారతీయ వైమానిక దళంలో హెలికాప్టర్ పైలెట్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో ఆమె విధులు నిర్వహించారు.. 2019 డిసెంబర్ లో ఫ్లయింగ్ బ్రాంచ్‌లో పర్మనెంట్ కమిషన్‌లో చేరారు.
కల్నల్ సోఫియా ఖురేషి:- ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ లో ఉన్నత అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు..భారతీయ సైన్యంలో ఓ ఆర్మీ కాంటింజెంట్‌కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా ఆఫీసర్.

