ఆపరేషన్ సిందూర్‌తో భారత్ వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పాం-ప్రధాని మోదీ
అమరావతి: ఆపరేషన్ సిందూర్’ ఇంకా పూర్తికాలేదని,,ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారందరిపై భారత్ నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు..పాక్ గడ్డపై ఇప్పటికే మూడుసార్లు దాడులు చేశామని గుర్తు చేశారు..గురువారం పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్ లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు..“బెంగాల్ గడ్డ నుంచి 140 కోట్ల మంది భారతీయుల తరఫున స్పష్టం చేస్తున్నా,, ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు” అంటూ స్పష్టం చేశారు..

భారతీయ మహిళల సింధూరంను చెరిపి వేసిన ఉగ్రవాదులపై మన దేశ సాయుధ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి..ఉగ్రవాదం పట్ల భారత్ జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంభించింది.. పాకిస్తాన్ కలలో కూడా ఊహించని విధంగా సరిహద్దు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసిందన్నారు.. వారి భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ మూడుసార్లు దాడులు చేశామని తెలిపారు.. ఆపరేషన్ సిందూర్‌తో,, భారత్‌పై దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రపంచానికి చాటిచెప్పాం..ఇప్పటికైన ఈ విషయాన్ని పాకిస్థాన్ అర్థం చేసుకోకుంటే,,భవిష్యత్ లో భారతదేశం వైఖరి మరింత కఠినంగా వుంటుందని ప్రధాని మోదీ పరోక్షంగా హెచ్చరించారు.
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై:-బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు.. ముర్షిదాబాద్,, మాల్దాలో అమయక ప్రజలపై జరిగిన హింస పట్ల, తృణమృల్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఒక వైపు క్రూరంగా మరో వైపు ఉదాసీనతకు చిహ్నంగా వుందని మండిపడ్డారు..తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆరోపించారు..బంగాల్లో నిర్మమత (దయలేని) ప్రభుత్వం ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు.. సీఎం మమత పేరును పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘నిర్మమత’ ప్రభుత్వం అని,,రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని ఆరోపించారు.

