పహల్గామ్‌లో దాడికి పాల్పపడిన ఉగ్రవాదులను అంతమొందించాం-అమిత్ షా
అమరావతి: పహల్గామ్‌లో ఏప్రిల్ 22వ తదిన 26 మంది పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు అంతమొందించామని మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రకటించారు.. ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా హోం మంత్రి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు..టూరిస్టులను ఉగ్రవాదులు కిరాతకంగా వారి కుటుంబ సభ్యుల ముందే పర్యాటకుల్ని దారుణంగా చంపారన్నారు.. మతం పేరు అడిగి మరీ చంపడం దారుణం అని,,పహల్గామ్ సంఘటనకు ప్రతీకారాన్ని ధృవీకరించారు.. ఆపరేషన్ మహాదేవ్‌లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను ఈనెల 22న శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ద్వారా బద్రతా బలగాలు కదలికలను గుర్తించాయన్నారు..ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినవారిని కూడా అరెస్ట్ చేశామన్నారు..బైసరస్, లిడ్వస్‌లో ఒకే రకమైన ఆయుధాలను ఉగ్రవాదులు వాడినట్లు భద్రతా దళాలు గుర్తించినట్లు అమిత్‌షా వెల్లడించారు.. పహల్గామ్ దాడి ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్ము పోలీసులకు అభినందనలు తెలిపారు.. ఉగ్రవాదులను అంతమొందించామని చెప్పగానే విపక్షాలు ఆనందం వ్యక్తం చేస్తాయనుకున్నాను అని అయితే విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని,, ఉగ్రవాదులు అంతమొందించామన్న సంతోషం కూడా విపక్షాలకు లేదని అమిత్‌షా విమర్శించారు.

