పాకిస్థాన్ కొలుకోలేని దాడులు చేశాం-అక్కడ జరిగిన నష్టాలకు ఆ దేశ ఆర్మీదే బాధ్యత-ఎయిర్ మార్షల్
అమరావతి: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌళిక సదుపాయాలు,,ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దాడులు చేశామ అని,,అయితే పాకిస్థాన్ మిలిటరీ వారి దేశంలోని ఉగ్రవాదులకు మద్దతూ ఇవ్వడంతో ఉద్రిక్తతలు పెరిగాయని ఎయిర్ మార్షల్ ఏకే భార్తి తెలిపారు..సోవామరం ఆపరేషన్ సింధూర్ గురించి త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి..మూడు దళాలకు చెందిన డీజీఎంవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ఉగ్రవాదులను టార్గెట్ చేసిన సమయంలో పాకిస్థాన్ మిలిటరీ జోక్యం చేసుకున్నదని, ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించడంతో తాము రెస్పాండ్ అయినట్లు ఆయన తెలిపారు..పాకిస్థాన్‌లో జరిగిన నష్టాలకు ఆ దేశ ఆర్మీదే బాధ్యత అని ఆయన అన్నారు.. తాము కేవలం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాత్రమే పోరాడినట్లు చెప్పారు.. భారతీయ వైమానిక రక్షణ వ్యవస్థ,, పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడడంలో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసినట్లు భార్తి తెలిపారు..గత దశాబ్ధ కాలంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్ల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ బలంగా తయారైందన్నారు..మన మిలిటరీ బేస్‌లు,, మన వ్యవస్థలన్నీ పూర్తిగా ఆపరేషన్‌లో ఉన్నాయని,, భవిష్యత్తులో ఎటువంటి మిషన్ అయినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని భార్తి తెలిపారు..ఇండియాపై అటాక్ చేసిన సమయంలో పాకిస్థాన్ చైనాకు చెందిన పీఎల్-15 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ వాడరని ఆ మిస్సైల్‌ను శకలాలను ప్రదర్శించారు..అలాగే టర్కీకి చెందిన వైఐహెచ్, సోన్‌గార్ డ్రోన్ల శకలాలను కూడా ఇండియా ప్రదర్శించింది.

