పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలులోనే హతమార్చారా?
అమరావతి: ప్రముఖ క్రికెటర్,,పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను జైలులోనే చంపేశారంటూ సోషల్ మీడియాల్లో వార్తా కథనాలు హల్ చల్ చేస్తున్నాయి..ఈ సంఘటలకు సాక్ష్యలంటూ కొన్ని ఫోటోలు,, వీడియోలు వైరల్ అవుతున్నాయి..2023 నుంచి అడియాలా జైలులో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో చిత్రహింసలకు గురి చేసి హతమార్చారని కథనాలు వస్తున్నాయి..పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ,, మిలటరీ చీఫ్ అసిమ్ మునీర్ కలిసి ఆయనను హతమార్చినట్టు బలూచిస్థాన్ విదేశాంగ శాక తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.. ఈ కథనాలను అధికారింగా అటూ నాయకులు,,ఇటు అదికారులు ఎవరూ ధ్రువీకరించలేదు..
అఫ్గానిస్థాన్ మీడియాలోనూ:- ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియోలో రావడంతో పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు సదరు జైలు వద్దకు చేరుకుని,, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులను జైలులోకి అనుమతించాలని డిమాండ్లు చేస్తున్నట్టు సమాచారం.. అడియాలా జైలు బయట ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులపై పోలీసు దారుణంగా దాడి చేసినట్లు వార్తాలు అందుతున్నాయి.. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఇదే సమయలోం అడియాలా జైలులోనే ఆయనను హత్య చేసినట్టు అఫ్గానిస్థాన్ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి..అధికార ప్రకటన కోసం వేచి చూడాలి??


