వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు-అధ్యక్షడిని అరెస్ట్ చేశాం-ట్రంప్
ప్రపంచలో అత్యంత ఎక్కువ చమురు నిల్వలు..
అమరావతి: వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు చేసింది. యూఎస్ సైన్యం అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను తమ కస్టడిలోకి తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.వారిద్దరినీ ప్రస్తుతం వెనుజువెలా వెలుపలకు తరలించినట్లు అయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. వెనెజువెలాపై అమెరికా దాడి చేస్తుందని, అందుకు తగ్గ వ్యూహాన్ని రచించుకుందని కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే జరిగింది.వెనుజులాలోని 7 ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున అమెరికా దాడులు ప్రధానంగా రాజధాని కారకాస్ నగరంతో పాటు మిరాండా, అరాగువా, లా గువైరా రాష్ట్రాల పరిధిలోని నగరాలు, నౌకాశ్రయాలు, సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్టు తెలుస్తోంది. అమెరికా చేసిన దాడిలో వెనెజువెలా సైనిక మౌలిక సదుపాయాలకు ఎంత నష్టం జరిగింది? ఎంత ప్రాణనష్టం జరిగింది? అన్న వివరాలు వెల్లడికావాల్సి ఉంది.వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో దీనిపై స్పందిస్తూ,, మృతులు, గాయపడినవారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందని తెలిపారు. అమెరికా చేసిన దాడులు సాధారణ ప్రజలు ఉండే ప్రాంతాలనూ ప్రభావితం చేసినట్లు చెప్పారు.
ప్రపంచలో అత్యంత ఎక్కువ చమురు నిల్వలు వున్న దేశం వెనుజులా. ఇప్పటికే అమెరికా దాదాపు 30 ట్రిలియన్ డాలర్లు అప్పుల ఉబిలో కూరుకుని పోయింది. ఇలాంటి పరిస్థితిలో వెనుజులా దేశంను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటే,,ఆ దేశంలో వున్న చమురును కొల్లగొట్టవచ్చు.ఆ దేశంను ఆక్రమించు కొవాలంటే,,ఎదొ ఒక సాకు చూపాలి. వెనుజులా డ్రగ్స్ సరాఫరా చేస్తొందంటూ దొంగ మాటలు విన్పిస్తూ, ఈ దారుణంకు ఒడికట్టారు. అమెరికాలోకి ఫెద్ద ఎత్తున్న డ్రగ్స్ సరఫరా చేస్తున్న దేశాలు మెక్సికో,,కొలంబిలు వున్నాయి. వాటి జోలికి ఎందుకు వెళ్లడం లేదంటే,, ఆదేశాల వద్ద ఇంత స్థాయిలో చమురు నిల్వలు లేవు కాబట్టి.

