ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నిన ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్
అమరావతి: దేశ రాజధానిలోని ప్రముఖ ప్రాంతమైన దక్షిణ ఢిల్లీలోని షాపింగ్ మాల్స్,,పబ్లిక్ పార్క్ తో సహా ఎక్కువ జనసమ్మర్ద ప్రాంతంలో పేలుళ్లు జరపడానికి సిద్ధమవుతున్న ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు..నిఘా సంస్థల నుంచి అందిన పక్కా సమాచారంతో ఢిల్లీలోని సాదిక్‌నగర్,, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రాంతాల్లో పోలీసులు (Special Cell) దాడులు నిర్వహించారని ఢిల్లీ పోలీసు అదనపు పోలీస్ కమిషనర్ (స్పెషల్ సెల్) ప్రమోద్ కుష్వాహా విలేకరుల సమావేశంలో తెలిపారు..ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో ఆత్మాహుతి దాడుల కోసం శిక్షణ పొందుతున్న భోపాల్‌కు చెందిన అద్నాన్,,మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందినవారన్నారు..వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు..నిందితులకు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.. విచారణ సందర్భంగా దీపావళీ సమయంలో దక్షణి ఢిల్లీలోని రద్దీ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్లు వారు అంగీకరించినట్లు కుష్వాహ తెలిపారు..వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.. ఈ ఘటనపై మరింత సమాచారం రాబట్టేందుకు విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇద్దరు ఉగ్రవాదుల పేరు ఒకటే:- ఢిల్లీకి చెందిన నిందితుడిని అక్టోబర్ 16న సాదిక్ నగర్‌లో మొదట అరెస్టు చేశారు.. అతని విచారణలో లభించిన ఆధారాల ఆధారంగా, రెండవ అద్నాన్‌ను భోపాల్‌లో అరెస్టు చేశారు.

