మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరిన టీటీవీ దినకరన్
వేడిక్కేతున్న తమిళ రాజకీయాలు..
అమరావతి: ఈ సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికారమే లక్ష్యంగా తమిళనాట NDA కూటమి అడుగులు వేస్తొంది.గత కొంతకాలంగా NDAకు దూరంగా ఉంటున్న ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం'(AMMK) చీఫ్ టీటీవీ దినకరన్,, బుధవారం మళ్లీ NDA కూటమిలో చేరారు. రాష్ట్ర BJP ఎన్నికల ఇన్‌ఛార్జ్ పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన కూటమి కండువా కప్పుకున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముక్కులతార్ వర్గం ఓట్లను ఏకీకృతం చేయడంతో సహా అధికార DMKను ఒడించే దిశగా కూటమిని బలోపేతం చేస్తుందని,, జనవరి 23న చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభ, ఎన్నికల యుద్దంకు NDA శ్రేణులను సిద్దం చేయడమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరడంపై:- దినకరన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు, సుపరిపాలన కోసం పాత విభేదాలను పక్కనపెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామన్నారు. తమిళనాడు అభివృద్ధి, సంక్షేమం, పార్టీ ఉనికి కోసం కొన్ని సమయాల్లో రాజీపడటం బలహీనత కాదని,, అది ఉమ్మడి ప్రయోజనాల కోసమేనని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత(అమ్మ) ఆశయాలను అనుసరించే వారంతా ఒకే తాటిపైకి వచ్చి, రాష్ట్రంలో మళ్లీ ‘అమ్మ పాలన’ను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని గుర్తు చేశారు. జనవరి 23న చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు దినకరన్ హాజరై తన బలాన్ని ప్రదర్శించనున్నట్లు సమాచారం.

