ట్రంప్ విధానం, కాలం చెల్లిన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది-పుతిన్
వలస రాజ్యాల శకం ముగిసిందని..
అమరావతి: 1.5 బిలయన్ల జనాభా కలిగిన భారత్,, బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలపై సుంకాల పేరుతో వారిని శిక్షించే ప్రయత్నాలు చేస్తే అవి ఆ దేశ నాయకులను ప్రమాదంలోకి నెట్టివేస్తాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.. అమెరికా ఇరు దేశాలపై అమెరికా విధిస్తూన్న ట్రేడ్ టారిఫ్స్ ను పుతిన్ తీవ్రంగా ఖండించారు.. ఇటువంటి చర్యలు కాలం చెల్లిన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. చైనాలో తన నాలుగు రోజుల పర్యటన తర్వాత పుతిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు..ఈ రెండు దేశాలు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, దేశీయ చట్టాలు కలిగి ఉన్నాయంటూ,,భారత్, చైనాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అండగా నిలిచారు..దీర్ఘకాలంగా ఉన్న ఆయా దేశాల సార్వభౌమాధికారంపై దాడులుగా భావించే అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు.. వలస రాజ్యాల శకం ముగిసిందని,,భాగస్వాములతో జాగ్రత్తగా మాట్లాడాలని ట్రంప్‌కు హితవు పలికారు..ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ,, మళ్లీ ఆయా దేశాల మధ్య సాధారణ పరిస్థితులు చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు..ఉక్రెయిన్ యుద్ధాన్ని కేవలం ఓ సాకుగా చూపి టారీఫ్ లతో ట్రంప్ రెచ్చిపోతున్నారని,, ఇందుకు ఉదాహరణ, ఉక్రెయిన్ యుద్ధానికి ప్రత్యక్ష సంబంధం లేని బ్రెజిల్ దేశంపై అమెరికా అదనపు సుంకాలను విధించడాన్నీ పుతిని ఎత్తి చూపారు.