టారిఫ్ లపై ట్రంప్ కు గొడ దెబ్బ-సుప్రీం కోర్టు చెంపదెబ్బ
అమరావతి: అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీం కోర్టు తిరస్కరించింది.టారిప్ లను విధించే హక్కు అధ్యక్షుడికి లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందేనని యూఎస్ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై సుంకాలకు సంబంధించి ట్రంప్ దూకుడుగా వ్యవహరించడం అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం-1977కి విరుద్ధమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ వెల్లడించారు. సుంకాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 6 మంది, అనుకూలంగా ముగ్గురు జడ్జిలు విడివిడిగా తమ తీర్పును ఇచ్చారు. దింతో 6-3 మెజార్టీతో ట్రంప్ సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. సుంకాలతో సహా పన్నులు విధించే అధికారాన్ని రాజ్యాంగం యూఎస్ కాంగ్రెస్ మాత్రమే ఇచ్చిందని, కార్యనిర్వాహక శాఖకు కాదని ఈ సందర్భంగా న్యాయస్థానం వెల్లడించింది.

